దిబాంగ్ వ్యాలీ జిల్లా
డిబాంగ్ వ్యాలీ జిల్లా | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | అరుణాచల్ ప్రదేశ్ |
ముఖ్య పట్టణం | అనిని |
విస్తీర్ణం | |
• మొత్తం | 9,129 కి.మీ2 (3,525 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 8,004 |
• జనసాంద్రత | 0.88/కి.మీ2 (2.3/చ. మై.) |
• Urban | 27.55% |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 64.8% |
• లింగ నిష్పత్తి | 808 |
డిబాంగ్ వ్యాలీ జిల్లా, భారతదేశం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా.[1][2] ఈ జిల్లాలో డిబాంగ్ నది ప్రవహిస్తున్న కారణంగా దీనికీ ఈ పేరు వచ్చింది.[3] మిష్మి ప్రజలు దీనిని టాలన్ అంటారు. 9,128 చ.కి.మీ వైశాల్యం ఉన్న డిబాంగ్ లోయ జిల్లా రాష్ట్రంలో వైశాల్యపరంగా ప్రథమ స్థానంలో ఉన్నప్పటికీ భారతదేశంలో అత్యల్ప జనసాంధ్రత ఉన్న జిల్లాలలో ఇది ప్రథమ స్థానంలో ఉంది.
చరిత్ర
[మార్చు]1980లో లోహిత్ జిల్లాలో కొంత భాగం వేరుచేయగా డిబాంగ్ లోయ జిల్లా ఏర్పడింది.[4] 2011 డిసెంబరు 16న డిబాంగ్ లోయ జిల్లా ఎగువ డిబాంగ్ లోయ జిల్లా, దిగువ డిబాంగ్ లోయ జిల్లాలుగా విభజించబడింది.[4]
భౌగోళికం
[మార్చు]రిపబ్లిక్ చైనాలో జన్మించిన డిబాంగ్ నది ఈ జిల్లా గుండా ప్రవహిస్తుంది, కనుక ఈ జిల్లాకు ఈ పేరు వచ్చింది. ఈ జిల్లాకు అనిని కేంద్రంగా ఉంది. ఇది భారతదేశ ఉత్తర, ఈశాన్య జిల్లాలలో చివరిది.
విభాగాలు
[మార్చు]దిబాంగ్ లోయ జిల్లాలో ఒకే ఒక అనిని శాసనసభ నియోజకవర్గం ఉంది. ఇది అరుణాచల్ ప్రదేశ్ పార్లమెంటరీ నియోజకవర్గంలో భాగంగా ఉంది.[5]
జనాభా గణాంకాలు (2011)
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం అరుణాచల్ ప్రదేశ్‌లోని డిబాంగ్ వ్యాలీ జిల్లా మొత్తం జనాభా 8,004. వీరిలో 4,414 మంది పురుషులు కాగా, 3,590 మంది మహిళలు ఉన్నారు.[6] జిల్లాలో మొత్తం 1,952 కుటుంబాలు ఉన్నాయి. జిల్లా సగటు లింగ నిష్పత్తి 813.
జిల్లా మొత్తం జనాభాలో 29.8% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, 70.2% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సగటు అక్షరాస్యత రేటు 84% కాగా గ్రామీణ ప్రాంతాల్లో 55.6%. అలాగే డిబాంగ్ వ్యాలీ జిల్లాలోని పట్టణ ప్రాంతాల లింగ నిష్పత్తి 812 కాగా, గ్రామీణ ప్రాంతాల వారిది 814గా ఉంది.
డిబాంగ్ వ్యాలీ జిల్లాలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 1084, ఇది మొత్తం జనాభాలో 14%. 0-6 సంవత్సరాల మధ్య 574 మంది మగ పిల్లలు ఉండగా, 510 మంది ఆడ పిల్లలు ఉన్నారు. ఈ విధంగా జిల్లా లోని పిల్లల లింగ నిష్పత్తి 889, ఇది దిబాంగ్ వ్యాలీ జిల్లాలోని సగటు లింగ నిష్పత్తి (813) కంటే ఎక్కువ. డిబాంగ్ వ్యాలీ జిల్లా మొత్తం అక్షరాస్యత రేటు 64.1%. పురుషుల అక్షరాస్యత రేటు 59.22% ఉండగా, స్త్రీల అక్షరాస్యత రేటు 50.75%గా ఉంది.
ప్రజలు
[మార్చు]దిబాంగ్ లోయ జిల్లాలో మిష్మి (ఇడు) ప్రజలు అధికంగా ఉన్నారు. మిష్మి ప్రజలలో వారి వలస గురించిన కథ ఒకటి ప్రచారంలో ఉంది. ఈ కథలో చీతూ- హులుని ప్రాంతం, మిష్మి ప్రజలు సంచరించిన 12 నదీ ప్రాంతాలు గురించిన వర్ణన ఉంది. వీరు మొదట అహూం రాజ్యంలో నివసించారని ఈ కథనాలు వివరిస్తున్నాయి. మిష్మి ప్రజలు సాధారణంగా దట్టమైన అటవీ ప్రాంతంలో నివసిస్తుంటారు.
భాషలు
[మార్చు]దిబాంగ్ లోయ జిల్లాలో మిష్మి, సిన్జొ-టిబెటన్ భాషలను దాదాపు 25,000 మంది ప్రజలు మాట్లాడుతున్నారు. దీనిని టిబెటన్, లాటిన్ లిపిలో వ్రాస్తుంటారు.[7]
వృక్షజాలం, జంతుజాలం
[మార్చు]దిబాంగ్ లోయ జిల్లా వన్యసంపదతో సుసంపన్నమై ఉంది. ఇక్కడ మిష్మి టాకిన్, గాంగ్షణ్ మౌంట్జాక్ వంటి అరుదైన క్షీరదాలున్నాయి. అలాగే స్కల్టర్ మోనల్ వంటి పక్షులు ఉన్నాయి.[8] సైన్సు ప్రపంచంలో సరికొత్తగా కనిపెట్టబడిన ఎగిరే ఉడుత కూడా ఈ జిల్లాలో కనిపిస్తుంది.[9] 1991లో ఎగువ డిబాంగ్ లోయ జిల్లాలో 4,149 చ.కి.మీ వైశాల్యంలో " డిబాంగ్ విల్డ్‌లైఫ్ శాంక్చ్యురీ " ఏర్పాటు చేయబడింది.[10]
మూలాలు
[మార్చు]- ↑ National Portal of India : Know India : Districts of India. India.gov.in.
- ↑ "Arunachal Pradesh Population Census 2011, Arunachal Pradesh Religion, Literacy, Sex Ratio - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-09-21.
- ↑ History : Lower Dibang Valley Archived 2011-05-26 at the Wayback Machine. Roing.nic.in (16 December 2001).
- ↑ 4.0 4.1 Law, Gwillim (25 September 2011). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
- ↑ "Assembly Constituencies allocation w.r.t District and Parliamentary Constituencies". Chief Electoral Officer, Arunachal Pradesh website. Archived from the original on 13 August 2011. Retrieved 21 March 2011.
- ↑ "Dibang Valley District Population Religion - Arunachal Pradesh, Dibang Valley Literacy, Sex Ratio - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-09-21.
- ↑ M. Paul Lewis, ed. (2009). "Mishmi: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
- ↑ Choudhury, Anwaruddin(2008) Survey of mammals and birds in Dihang-Dibang biosphere reserve, Arunachal Pradesh. Final report to Ministry of Environment & Forests, Government of India. The Rhino Foundation for nature in NE India, Guwahati, India. 70pp.
- ↑ Choudhury,Anwaruddin (2009).One more new flying squirrel of the genus Petaurista Link, 1795 from Arunachal Pradesh in north-east India. The Newsletter and Journal of the RhinoFoundation for nat. in NE India 8: 26–34, plates.
- ↑ Indian Ministry of Forests and Environment. "Protected areas: Arunachal Pradesh". Archived from the original on 23 August 2011. Retrieved 25 September 2011.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help)
భౌగోళిక స్థితి
[మార్చు]వెలుపలి లింకులు
[మార్చు]- Pages with non-numeric formatnum arguments
- CS1 అమెరికన్ ఇంగ్లీష్-language sources (en-us)
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox settlement with bad settlement type
- Pages using infobox settlement with no coordinates
- అరుణాచల్ ప్రదేశ్ జిల్లాలు
- 1980 స్థాపితాలు
- దిబాంగ్ వ్యాలీ జిల్లా
- భారతదేశం లోని జిల్లాలు